రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల నిర్వహణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంకేతాలు ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్.. అక్కడ ఈ ఏడాది లోపు శాసనసభ ఎన్నికలు జరగవచ్చని తెలిపారు. అక్కడ ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తైందని గుర్తు చేశారు. సీట్ల సంఖ్య కశ్మీర్ ప్రాంతంలో 47, జమ్మూలో 43కు పెరిగిందని తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో 2018 జూన్ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేసింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ను రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది.
ఈ ఏడాదే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు! - Rajnath Singh news
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు రక్షణమంత్రి రాజ్‌నాథ్. కుదిరితే ఈ ఏడాది చివర్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఇటీవలే ముగిసిందని చెప్పారు.
ఈ ఏడాదే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు!
Last Updated : Jun 17, 2022, 9:01 PM IST