హరియాణాలో ఓ వింత ఘటన జరిగింది. భద్రత విషయంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి.. సాయం కోసం ఓ బాబాను ఆశ్రయించారు. ప్రజలకు భద్రత అందించాల్సిన పోలీసే నిస్సహాయ స్థితిలో బాబా చెంతకు చేరారు.
తన ఇంట్లో దొంగతనం జరిగిందని.. ఆ నిందితులను పట్టుకోవడానికి సహాయం కోసం వచ్చినట్లు ఏఎస్సై.. పండోఖర్ బాబాకు తెలిపారు. దొంగ అడ్రస్‌ను అడగగా.. ఆ క్లూ మీ పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉందని బాబా చెప్పారు. పంజాబ్ సరిహద్దులకు వెళ్తే ఆ దొంగలను పట్టుకోవచ్చని.. అయినా సరే నిందితుల వద్ద దొంగలించిన వస్తువులు దొరుకుతాయని గ్యారంటీ లేదన్నారు.
పోలీసుల ఇళ్లలోనే చోరీ.. దొంగను పట్టుకోవడానికి 'బాబా' సాయం కోరిన ఏఎస్సై - చాందీనీబాగ్ పోలీస్ క్వార్టర్స్ దొంగతనం
ఎవరింట్లో అయినా దొంగతనం జరిగితే ఏం చేస్తారు? వెంటనే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తారు. అదే ఓ పోలీస్ ఇంట్లోనే దొంగతనం జరిగితే ఏం చేస్తారు. దొంగను ఇట్టే పట్టేస్తారు అనుకుంటే పొరపాటే! అయితే కొన్ని రోజుల క్రితం హరియాణాలోని ఓ పోలీస్ అధికారి ఇంట్లో దొంగతనం జరిగింది. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసు అధికారి చివరికి.. ఓ బాబా సాయం కోరారు. ఆ తర్వాత ఏమైందంటే?
చాందినీబాగ్ పోలీస్ క్వార్టర్స్‌లో డిసెంబర్ 23న అర్ధరాత్రి ఇద్దరు పోలీసుల ఇళ్లలో దొంగతనం జరిగింది. ఏఎస్సై కృష్ణ కుమార్ తన క్వార్టర్స్‌కు చేరుకోగా ఇంటి తాళం తెరిచి ఉండడాన్నిగమనించాడు. ఇంట్లో వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే తేరుకుని ఇంట్లో చూడగా.. 40 తులాల బంగారం, రూ.3.45 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ దొంగల ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ఏఎస్సై కృష్ణ కుమార్ చేసేదేమీ లేక సహాయం కోసం.. పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు.
ఇవీ చదవండి: