శృంగారంలో కామోద్దీపన పొంది స్వర్గసుఖాలు చవిచూడాలని ఆరాటపడిన ఆ ప్రేయసీప్రియుల అత్యుత్సాహం తీరని విషాదాన్ని మిగిల్చింది. నైలాన్ తాడు మెడకు చుట్టుకుని ప్రియుడు విగతజీవిగా మారాడు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ సమీప ఖాపర్ఖేడ్ గ్రామ లాడ్జిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.
శృంగారంలో 'అపశృతి'- ప్రియుడు మృతి - nagpur lovers case
శృంగారంలో సర్వసుఖాలు అనుభవించాలని ఓ ప్రియురాలు చేసిన వింత పని ప్రియుడి ప్రాణం తీసింది. ఓ తెలుగు సినిమాలో.. ఓ విలన్ని మంచానికి కట్టేసినట్లుగా.. కుర్చీకి కట్టేసింది. అయితే ఆ ప్రియురాలు స్నానాల గదికి వెళ్లి వచ్చే లోపు ప్రియుడు విగతజీవిగా మారాడు.
నాగ్‌పుర్‌కు చెందిన 30ఏళ్ల యువకుడికి స్థానికంగా ఉండే ఓ మహిళతో అయిదేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి వీరు లాడ్జికి వెళ్లారు. శృంగారం సమయంలో ఆ యువకుడి కాళ్లు, చేతులను ఆమె నైలాన్ తాడుతో ఓ కుర్చీకి కట్టేసింది. మెడ చుట్టూ మరో తాడు బిగించింది. ఇలా చేయడం వల్ల కామోద్దీపన కలిగి శృంగారంలో మరింత సుఖం ఉంటుందనేది ఆమె ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. ఆ యువకుడు కుర్చీకి అలా ఉండగానే ఆమె స్నానాల గదికి వెళ్లింది. అదే సమయంలో కుర్చీ జారి కిందపడింది. యువకుడి మెడ చుట్టూ తాడు ఉచ్చులా బిగుసుకొని ఊపిరాడక చనిపోయాడు. పోలీసులు ప్రియురాలిని నిర్బంధంలోకి తీసుకుని, యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసు విచారణలో ఆమె తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని అంగీకరించింది. వాంగ్మూలాలు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి సెల్ఫోన్లను సీజ్ చేశారు.
ఇదీ చూడండి: బస్సు దగ్ధం.. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సేఫ్