తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్బా డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి.. మరణాన్ని తట్టుకోలేక తండ్రి సైతం.. - కుమారుని మరణం తట్టుకోలేక తండ్రి మరణం

గుజరాత్.. నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. గర్బా డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోనూ ఇదే తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి సైతం ప్రాణాలు విడిచాడు.

Youth dies playing Garba
గర్బా డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి

By

Published : Oct 3, 2022, 4:19 PM IST

నవరాత్రి వేడుకల్లో విషాదం.. గర్బా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

గుజరాత్ ఆనంద్ జిల్లాలో నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. తారాపుర్​లో జరుగుతున్న దసరా వేడుకల్లో వీరేంద్ర సింగ్ రాజ్​పుత్ అనే యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. కార్యక్రమ నిర్వాహకులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వీరేంద్ర ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబరు 30న జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

కొడుకు మరణవార్తను తట్టుకోలేక..
మరోవైపు, మహారాష్ట్ర పాల్ఘర్​లోని విరార్​లో దారుణం జరిగింది. గర్బా నృత్యం చేస్తూ మనీశ్ (35)అనే వ్యక్తి కుప్పకూలి.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. కొడుకు మరణవార్తను విన్న తండ్రి నర్పాజీ తట్టుకోలేక ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. మనీశ్, నర్పాజీ మృతదేహాలను విరర్​ పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details