దేశవ్యాప్తంగా యూకే రకం కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశంలో 96 కొత్త రకం కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ బాధితులందరినీ ప్రత్యేకమైన ఐసోలేషన్ రూంలో ఉంచినట్లు తెలిపింది. వారి తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులు, బంధువులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
96 మందికి కొత్త రకం కరోనా - భారత్‌లో యూకే కొత్తరకం కరోనా కేసులు
దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 96 మంది యూకే వైరస్ బారిన పడ్డారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం వారిని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా 96మందికి కొత్తరకం కరోనా
యూకేకు చెందిన కొత్త రకం కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెన్మార్క్, నెథర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్ల్యాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపుర్ దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
ఇదీ చదవండి :'కొత్త' కరోనాను గుర్తించేందుకు 'జినోమిక్స్ కన్సార్టియం'