అనుబంధాలు మనుషులకే కాదు మూగజీవాలకు ఉంటాయి. అనుకోని ప్రమాదం వల్ల దూరమైన ఓ చిరుత కూనను తిరిగి తన తల్లి దగ్గరకు చేర్చారు అటవీ శాఖ అధికారులు. గుజరాత్ తాపి అడవుల్లో కొన్ని రోజుల క్రితం ఓ చిరుత కూన తల్లితో వెళ్తూ ప్రమాదవశాత్తు ఓ బావిలో పడింది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లి చిరుత తిరిగి అడవిలోకి వెళ్లిపోగా.. కొంతమంది రైతులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
బావిలో పడిన చిరుత కూనను బయటకు తీసిన అధికారులు.. తల్లి తిరిగే ప్రదేశంలో వదిలి పెట్టారు. కూన అరుపులను పసిగట్టిన తల్లి చిరుత దాని దగ్గరకు వెళ్లి అప్యాయంగా నోట్లో కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.