మరాఠా రిజర్వేషన్ల కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు - ఇందిరా సహానా కేసు
12:00 March 26
మరాఠా రిజర్వేషన్ల కేసు
మరాఠా రిజర్వేషన్ల కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఇందిరా సహానీ కేసు తీర్పు పునః సమీక్షపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
1992లో ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సమీక్షించాలా? లేదా? అన్న అంశాన్ని సుప్రీంకోర్టు నిర్ణయించనుంది. ఈ అంశంపై ఇటీవల అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాజ్యాంగ ధర్మాసనం తీసుకుంది.
ఇదీ చదవండి:దేశంలో ఏకైక క్షయ రహిత జిల్లాగా బుద్గాం