supreme court : అంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఓ కేసు విచారణలో ఉండగా దానిని మధ్యలో ఆపేసి మరో కేసును ఎలా విచారిస్తామని.. జస్టిస్ కేఎం జోసెఫ్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేశారు. జులై 11న విచారిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. రాజధానికి సంబంధించిన అమరావతి పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న ఏపీ తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని ఆయన నిరాకరించారు. ఒక కేసు విచారణ పూర్తి చేయకుండా మరో కేసును ఎలా విచారించగలమని జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అలా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించారు.
నిబంధనలకు విరుద్ధం...ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమరావతి పిటిషన్ విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ నిరాకరించారు. ఒక కేసు విచారణ పూర్తి చేయకుండా మరో కేసును ఎలా విచారించగలమని జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు.
భోజన విరామం అనంతరం...సుప్రీం కోర్టు.. మంగళవారం బాంబే మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన కేసు విచారణ చేపట్టింది. ఈ కేసు సగంలో ఉండగా భోజన విరామ సమయమైంది. అనంతరం బెంచ్ కూర్చొనే సమయానికి ఇతర అంశాలు, కేసులకు సంబంధించి మెన్షనింగ్స్ జరిగాయి. ముంబయి కేసు విచారణ తిరిగి ప్రారంభించే ముందు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు అమరావతి పిటిషన్ తీసుకోవాలని కోరారు. దీంతో జస్టిస్ కేఎం జోసెఫ్.. న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక కేసు విచారణ జరుగుతోందని, ఆ కేసు విచారణ మధ్యలో ఆపేసి.. దానిని కాదని పక్కనబెట్టి మీ కేసు ఎలా తీసుకోవాలని జస్టిస్ ప్రశ్నించారు.