The Supreme Court bench refused interim protection to Avinash: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ అరెస్ట్ నుంచి రక్షించాలన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆయనకు (అవినాష్ రెడ్డి) మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ఈ విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది.
Avinash Issue in SC: అవినాష్‌కు లభించని ఊరట.. అరెస్టు చేయొద్దని ఆదేశించలేమన్న సుప్రీం - The Supreme Court bench refused
12:33 May 23
ఈనెల 25న విచారణ జరపాలని హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు సుప్రీం ఆదేశాలు
అవినాష్ తరుపు లాయర్‌పై ధర్మాసనం అసహనం..:విచారణ సమయంలో ధర్మాసనం ఎదుట.. అవినాష్ రెడ్డి తరుపు లాయర్, సునీత తరుపు లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 24 తర్వాత అవినాష్ రెడ్డి ఎన్నిసార్లు సీబీఐ విచారణకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు సునీత తరపు న్యాయవాది లూథ్రా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత 3 సార్లు సమన్లు ఇచ్చారని గుర్తు చేశారు. అయినా, ఒక్కసారి కూడా సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి వెళ్లలేదని న్యాయవాది లూథ్రా తెలిపారు. అనంతరం సీబీఐ అధికారులు అనివాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నిస్తే హంగామా చేశారన్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని సునీత తరఫు లాయర్ లూథ్రా వ్యాఖ్యానించగా.. వెంటనే అవినాష్ రెడ్డి న్యాయవాది లాయర్ లూథ్రాపై తీవ్రంగా ఆగ్రహించారు. అవినాష్ రెడ్డికి సంబంధించిన ప్రతి పిటిషన్‌లోనూ న్యాయవాది లూథ్రా జోక్యం చేసుకుంటున్నారని అవినాష్ రెడ్డి లాయర్ మండిపడ్డారు. దీంతో ఎందుకు అంత అసహనమని అవినాష్ రెడ్డి లాయర్‌పై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన అవినాష్ రెడ్డి తరుపు లాయర్.. సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు.
జోక్యం చేసుకోలేము.. అనంతరం సీబీఐ న్యాయవాదుల గైర్హాజరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక దశలో ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం.. ఏదైనా చెప్పాలనుకుంటే వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించవచ్చని పేర్కొంది. అంతేకాదు, పాత పిటిషన్‌తో సంబంధం లేకుండా ఈ పిటిషన్‌ను ప్రస్తావించవచ్చని తెలిపింది. తుదకు ఈ నెల 25వ తేదీన విచారించాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు ఆదేశాలు ఇచ్చింది. అన్ని పక్షాలు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగిందంటే..వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగాతన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజులపాటు సీబీఐ విచారణకు హాజరుకాలేనని, అందువల్ల తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించి, నిర్ణయం వెలువరించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై ఈరోజు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో భాగంగా కీలక విషయాలను ప్రస్తావించిన ధర్మాసనం.. ఈనెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. వీలైనంత వరకు ముందస్తు బెయిల్‌పై అదేరోజు విచారణ ముగించేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది. అన్ని పక్షాలు వెకేషన్ బెంచ్ ముందే వాదనలు వినిపించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి :