భారతదేశానికి రెండు అపరిమిత శక్తులు ఉన్నాయని ప్రపంచం అంగీకరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవి జనాభా, ప్రజాస్వామ్యం అని చెప్పారు. యువతను భారత్ అభివృద్ధి ఛోదకులుగా పరిగణిస్తుందని చెప్పారు. పుదుచ్చేరిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్లో ఎంస్ఎంఈ పాత్ర చాలా కీలకం. ప్రపంచాన్ని మార్చే సాంకేతికతను ఎంఎస్ఎంఈ రంగంలో ఉపయోగించడం చాలా కీలకం. ఈ కొత్త కేంద్రం ఆ దిశగా కీలక ముందడుగు అవుతుంది. భారత్కు యువతే బలం. 2022 వారికి చాలా కీలకం. యువత వల్లే దేశంలో డిజిటల్ పేమెంట్స్ దూసుకుపోతున్నాయి. అన్ని తరాలకు యువతే ఆదర్శం. స్వాతంత్ర్య సమర యోధుల కలలను యువతే సాకారం చేయాలి. 15-18ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 2కోట్లకుపైగా పిల్లలు టీకా తీసుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ల పెంచింది కూడా మన బిడ్డల జీవితాలను మెరుగుపరిచి మరిన్ని అవకాశాలు కల్పించేందుకే.'