బంగాల్, అసోం శాసనసభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెరపడింది. ఈ నెల 27న(శనివారం) పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
బంగాల్లో..
బంగాల్లో మొత్తం 294 శాసనసభ స్థానాలకు 8 దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశలో 30 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ఎన్నికల సంఘం.
30 నియోజకవర్గాలు గిరిజన ప్రాబల్యం కలిగిన పురులియా, బంకుర, జర్గ్రామ్, పుర్బా మెదినీపుర్, పశ్చిమ్ మెదినీపుర్ జిల్లాలు ఉన్నాయి.