తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీరం టీకా 'కొవిషీల్డ్'​ ప్రత్యేకతలివే...

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా డోసులు ఇప్పటికే వ్యాక్సిన్ కేంద్రాలకు చేరుకున్నాయి. మరి ఈ టీకా ప్రత్యేకలు ఏంటో తెలుసా?

covishield
సీరం తయారుచేసిన 'కొవిషీల్డ్'​ ప్రత్యేకతలివే...

By

Published : Jan 16, 2021, 7:31 AM IST

Updated : Jan 16, 2021, 8:30 AM IST

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్త సౌజన్యంతో సీరం ఇన్​స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ శనివారం దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కరోనాను నిరోధించేందుకు దేశీయ టీకా కొవాగ్జిన్​తో పాటు కొవిషీల్డ్​ ముఖ్యభూమిక పోషించనుంది. అందుబాటు ధరల్లో లభిస్తున్న ఆక్స్​ఫర్డ్ టీకా ప్రత్యేకతలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం.

ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా కొత్త స్ట్రెయిన్​పై సమర్థంగా పనిచేస్తుందా?

బ్రిటన్​లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వెర్షన్ వైరస్​పైనా ఈ టీకా సమర్థంగా పనిచేస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు. వైరస్ పరివర్తనం చెందుతోంది తప్ప.. పూర్తిగా మారిపోలేదని నిపుణులు అంటున్నారు. కాబట్టి టీకా సమర్థతపై మ్యుటేషన్​(వైరస్​లో మార్పు) ప్రభావం ఉండదని భావిస్తున్నారు.

ఫైజర్, మోడెర్నాతో పోలిస్తే ఆక్స్​ఫర్డ్ వ్యాక్సిన్ ఎలా భిన్నమైంది?

స్పైక్ ప్రోటీన్లను ఉత్పత్తి చేసేందుకు వైరస్ జన్యుక్రమంపై ఆధారపడి ఆక్స్​ఫర్డ్ టీకా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ డబుల్ స్ట్రాండెడ్ 'డీఎన్ఏ'ను ఉపయోగిస్తుంది. కానీ ఫైజర్, మోడెర్నా టీకాలు సింగిల్ స్ట్రాండెడ్ 'ఆర్ఎన్ఏ'ను వినియోగిస్తాయి.

అడినోవైరస్​పై ఉన్న ప్రోటీన్ పొర కారణంగా ఆక్స్​ఫర్డ్ టీకాలో ఉన్న జన్యు పదార్థాలు సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ఈ టీకాను అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఆరు నెలల వరకు ఈ టీకాను నిల్వ చేయవచ్చు. కానీ మోడెర్నా టీకాను మైనస్ 4, ఫైజర్ టీకాను మైనస్ 70 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.

ప్రయోజనాలేంటి?

  • ఆక్స్​ఫర్డ్ టీకాను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చు
  • నిల్వ చేయడం సులభం
  • ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే అందుబాటు ధరకే లభ్యం
  • ఫైజర్ టీకా ఒక్కో డోసుకు 20 డాలర్లు, మోడెర్నా టీకా 19.5 డాలర్లు వసూలు చేస్తోంది. ఆక్స్​ఫర్డ్ వ్యాక్సిన్ ధర వీటితో పోలిస్తే చాలా తక్కువ

ఆక్స్​ఫర్డ్ టీకా ఎలా పనిచేస్తుంది?

కరోనా వైరస్ ప్రోటీన్​కు అడినోవైరస్​ను జత చేసి ఈ టీకాను తయారు చేశారు. అడినోవైరస్ అనేది సాధారణంగా ఫ్లూ, జలుబుకు కారణమయ్యే వైరస్. చింపాంజీలలో ఉండే సీహెచ్ఏడీఎస్ఎస్1 అనే వైరస్​ను ఇందులో ఉపయోగించారు. ఇది కణాలలోకి ప్రవేశిస్తుంది కానీ వాటికి ప్రతిరూపంగా మారదు. టీకా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కణాలతో అడినోవైరస్ అనుసంధానమై.. వాటి చుట్టూ ప్రోటీన్ పొరను ఏర్పరుస్తుంది. ఆ తర్వాత కణం ఓ బుడగలా తయారై వైరస్​ను అందులోకి లాగేస్తుంది. కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్లను యాంటీబాడీలు ఎదుర్కొని నాశనం చేస్తాయి.

ఆక్స్​ఫర్డ్ టీకా సురక్షితమేనా?

చింపాంజీ అడినోవైరస్​ వ్యాక్సిన్​ను ఆక్స్​పర్డ్ పరిశోధకులు చాలా ఏళ్లుగా పరీక్షిస్తున్నారు. ఎబోలా, జికా వైరస్​లతో పాటు ఎన్నో వ్యాధులకు ఈ విధానాన్నే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పరిశోధనలేవీ పూర్తి కాలేదు. కానీ, ఈ టీకా వల్ల ఏ దశలో కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కనిపించకపోవడం సానుకూలంశం.

ఈ అడినోవైరస్​తో తయారుచేసిన కరోనా టీకా ట్రయల్స్​లోనూ దుష్ప్రభావాలేవీ కనిపించలేదు. కానీ, వలంటీర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఫేజ్ 3 ట్రయల్స్​ను రెండు సార్లు ఆపేయాల్సి వచ్చింది. అయితే టీకా వల్ల తీవ్రమైన ఇబ్బందులేవీ ఎదురుకాలేదని ఆక్స్​ఫర్డ్ ప్రకటించింది.

Last Updated : Jan 16, 2021, 8:30 AM IST

ABOUT THE AUTHOR

...view details