తెలంగాణ

telangana

ETV Bharat / bharat

250 మందితో దిల్లీ చేరిన రెండో విమానం.. విద్యార్థుల హర్షం - Delhi airport

Indians in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే 'ఆపరేషన్​ గంగా'లో భాగంగా 250 మందితో బయలుదేరిన రెండో విమానం భారత్​కు చేరుకుంది. దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

second flight
దిల్లీ చేరిన రెండో విమానం

By

Published : Feb 27, 2022, 3:06 AM IST

Updated : Feb 27, 2022, 4:03 AM IST

Indians in Ukraine: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని సూచించారు. సురక్షితంగా భారత్​కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్​ నుంచి దిల్లీకి చేరిన విమానం
దిల్లీకి చేరిన వైద్య విద్యార్థులు
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని
రెండో విమానంలో దిల్లీకి చేరిన విద్యార్థులు

ఇప్పటికే రొమేనియా నుంచి 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా తొలి విమానం ముంబయికి చేరుకుంది.

Last Updated : Feb 27, 2022, 4:03 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details