కరోనా కరాళ నృత్యంతో మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లా వైద్య వ్యవస్థ కుప్పకూలిన తరుణాన ఓ వ్యాపారవేత్త తన ఉదారతను చాటుకున్నాడు. రవాణా వ్యాపారంలో (ట్రాన్స్పోర్ట్ కంపెనీ) ఉన్న ప్యార్ ఖాన్ సొంత డబ్బు వెచ్చించి నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్, నాగ్‌పుర్ జిల్లా పరిధిలోని ఆసుపత్రులకు 400 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును సరఫరా చేశారు. ఇందుకు సొంత నగదు రూ. 85 లక్షలు వెచ్చించారు. 'ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ మంచి పని నాకెంతో సంతృప్తిని ఇచ్చింది, ఇందుకోసం నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని ప్యార్ ఖాన్ తెలిపారు.
సొంత డబ్బుతో 400 టన్నుల ప్రాణవాయువు - ఆక్సిజన్ కొరత మహారాష్ట్రలో
దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త తన సొంత డబ్బుతో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను స్థానిక ఆసుపత్రులకు సరఫరా చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ మంచి పని తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని వ్యాపారవేత్త ప్యార్ ఖాన్ తెలిపారు.
వ్యాపారవేత్త ప్యార్ ఖాన్
తొలినాళ్లలో ఆయన ఎన్నో కష్టాలను అనుభవించారు. రైల్వేస్టేషన్ వద్ద నారింజ కాయలు అమ్మేవారు. అనంతరం ఆటోరిక్షా నడిపేవారు. ఆ తర్వాత తల్లి బంగారు నగలు విక్రయించి 2007లో ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన కంపెనీకి భారీ నెట్వర్క్ ఉంది.
ఇదీ చదవండి :ఆక్సిజన్ కొరతతో ఆరుగురు రోగులు మృతి