మహారాష్ట్రలోని నాశిక్‌లో ఇద్దరు మహిళలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు సుఖ్‌దేవ్ గులాబ్ మెచేవాల్ అనే రిక్షాడ్రైవర్. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు సహా ఓ వ్యక్తి ఈ ఘటన నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు. బాధితులు ఇంట్లో ఉన్న సమయంలో ఇది జరిగింది. మంటలకు ఇంట్లో ఉండే సామాగ్రి అంతా పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయంపై పంచవటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెట్రోల్ దాడిలో కాలిపోయిన సామాగ్రి ఇదీ జరిగింది..
ప్రదీప్ ఓం ప్రకాశ్ గౌడ్ అనే వ్యక్తి నాశిక్ షిండే నగర్లో నివాసం ఉండేవారు. ఆయన అత్త భారతీ గౌడ మంగళవారం ఇంటికి వచ్చారు. అయితే మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ప్రదీప్‌కు పరిచయం ఉన్న సుఖ్‌దేవ్.. ఇంటికి వచ్చి భారతీ గౌడ్‌ను నోటికి వచ్చినట్లు తిడుతూ, కొట్టసాగాడు. ఈ క్రమంలోనే తాను తెచ్చిన రెండు బాటిళ్ల పెట్రోల్‌ను ఇంట్లో ఉన్న భారతి గౌడ్ అమె సోదరి సుశీలపై విసిరాడు. దీంతో వారి శరీరానికి మంటలు అంటుకున్నాయి. ఇల్లంతా వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనను పోలీసులకు వివరిస్తున్న కుటుంబ సభ్యుడు ఇదీ చూడండి:పొలాల్లో కుప్పకూలిన వాయుసేన డ్రోన్