కరోనా మహమ్మారి విజృంభణతో గుజరాత్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొవిడ్ కేసులు పెరుగుతుండటం వల్ల ఆస్పత్రులు కిక్కిరిసాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో కరోనా బాధితులు చికిత్స కోసం ఆస్పత్రి బయటే అంబులెన్సులలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రి నుంచి ఎవరైనా డిశ్చార్జి అయితే కానీ మరొకరికి ప్రవేశం లేకుండా పోయింది.
కరోనా రోగులతో ఉన్న '108' వాహనాలు ఆసుపత్రి ముందు బారులు తీరిన వీడియోను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'బాధాకరమైన నిజం. దేవుడా.. దయచేసి అందర్నీ కాపాడు' అని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశారు.