మహారాష్ట్ర కొల్హాపుర్ జిల్లా భుదర్గడ్ తాలుకాలోని జోగెవాడి గ్రామ ప్రజలను అంబులెన్సు కష్టాలు వెంటాడుతున్నాయి. అక్కడ ఎవరిని ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా డోలీ కట్టాల్సిందే... నడుస్తూ కొండలు, కోనలు దాటాల్సిందే. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న సంగిత శివాజీ ఫట్కరే(23) అనే గర్భిణీని వెదురు బొంగులతో కట్టిన డోలీలో తీసుకెళ్లారు. దాదాపు 2 కిలోమీటర్లు నడిచి అంబులెన్సు వద్దకు చేర్చారు.