Woman Tied Up For 22 Years: ఓ మహిళను 22 ఏళ్లుగా ఇంట్లోనే బంధించారు కుటుంబ సభ్యులు. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గంగాబా చారిటబుల్ ట్రస్ట్ అనే ఓ ఎన్జీఓ ఆమెను విడుదల చేయించింది. సూరత్‌లోని ఉదానాకు చెందిన బాధితురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా గదిలో బంధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
22 ఏళ్లుగా గదిలో బందీగా మహిళ.. కుటుంబసభ్యులే కట్టేసి..
Woman Tied Up For 22 Years: 22 ఏళ్లుగా ఓ మహిళను ఇంట్లోనే బంధించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగుచూసింది. స్థానిక ఎన్జీఓ సహకారంతో ఆమెకు బందీ నుంచి విముక్తి కలిగింది.
'మీకే ఇబ్బంది': బాధితురాలిని విడుదల చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని వెల్లడించారు ఎన్జీఓ సభ్యులు జాల్పాబెన్ సొనానీ. బాధితురాలు తన కర్మఫలాలను అనుభవిస్తోందని ఆమె భర్త పేర్కొన్నారని తెలిపారు. "మమల్ని అమ్మ బాగా హింసించేది, ఆ సమయంలో మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదు. మీరు ఒకవేళ ఆమెను బలవంతంగా తీసుకెళ్తే మీపైన కూడా ఆమె దాడి చేస్తుంది" అని బాధితురాలి పిల్లలు తమను హెచ్చరించినట్లు చెప్పుకొచ్చారు సొనానీ. చివరకు పోలీసులు సాయంతో ఆమెకు బందీ నుంచి విముక్తి కలిగించామని తెలిపారు.
ఇదీ చదవండి:విద్యార్థుల మతమార్పిడికి యత్నం.. మహిళా టీచర్ సస్పెండ్