మధ్యప్రదేశ్లోని చిద్వాఢ్ జిల్లా ఆసుపత్రి భవనం ఐదో అంతస్తు నుంచి ఓ రోగి కిందకు దూకేశాడు. కింద పడే క్రమంలో అతను బాల్కనీకి ఏర్పాటు చేసిన రేలింగ్లో చిక్కుకున్నాడు. వేలాడుతూ కనిపించిన రోగిని సిబ్బంది రక్షించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సమీప జున్నార్దేవ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఐదో అంతస్తు నుంచి దూకిన రోగి.. ఆ తరువాత? - చిద్వార్ లో ఆసుపత్రి భవనం నుంచి దూకి వ్యక్తి
మధ్యప్రదేశ్లోని చిద్వాఢ్లో ఓ రోగి ఆసుపత్రి భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. బాల్కనీకి ఏర్పాటు చేసిన ఇనుప రేలింగ్లో చిక్కుకుపోయాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని రక్షించారు.
![ఐదో అంతస్తు నుంచి దూకిన రోగి.. ఆ తరువాత? the-patient-jumped-from-the-fifth-floor-of-the-hospital-building-in-chhindwara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11070707-853-11070707-1616139477885.jpg)
ఐదంతస్తుల నుంచి దూకిన రోగి... ఆ తరువాత?
అయితే రోగి మానసిక ఆరోగ్య సరిగా లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన్ని తిరిగి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.