తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ హాల్​లో 2500 ఏళ్లనాటి ఈజిప్టు మమ్మీ - రాజస్థాన్‌లో

రాజస్థాన్‌లో ఉన్న అత్యంత పురాతన మ్యూజియం ఆల్బర్ట్ హాల్‌లోని ప్రతి కళాఖండం సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉండే 2500 ఏళ్లనాటి ఈజిప్టు మమ్మీ మాత్రం ప్రత్యేక ఆకర్షణ. పురాతన ఈజిప్టు నగరం పనోపోలిస్‌లో జరిపిన తవ్వకాలలో ఈ మమ్మీ బయటపడింది. టూటూ అనే ఓ మహిళ మమ్మీ ఇది. ఆకాలంలో ఈజిప్టులో ఖెమ్ అనే దేవుడిని పూజించేవారట. టూటూ.. ఆ పూజలు చేసే పండితుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా చెబుతారు. 1880లో ఈజిప్టు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం మమ్మీని భారత్‌కు తీసుకొచ్చింది. అప్పటి నుంచీ ఆల్బర్ట్ హాల్‌లోనే భద్రపరుస్తున్నారు.

The oldest museum in Rajasthan is the Albert Hall
ఆ హాల్​లో 2500 ఏళ్లనాటి ఈజిప్టు మమ్మీ

By

Published : Feb 21, 2021, 8:31 AM IST

రాజస్థాన్‌లోని అత్యంత పురాతన మ్యూజియం ఆల్బర్ట్ హాల్

ఆల్బర్ట్ హాల్..! వందల ఏళ్ల చరిత్రను ఇప్పటికీ పదిలపరుస్తున్న ఓ భవనమిది. 1876లో కింగ్ ఆల్బర్ట్ దీనికి శంకుస్థాపన చేశారు. ప్రపంచవ్యాప్తంగా విశిష్టంగా నిలిచే కళాఖండాలన్నీ ఒకచోటకు చేర్చే ఉద్దేశంతో ఆల్బర్ట్ హాల్ నిర్మాణం చేపట్టారు.

"కింగ్ ఆల్బర్ట్..కొత్త మ్యూజియం నిర్మాణం ఎక్కడ చేయాలో వెదుక్కుంటూ కోసం జైపూర్‌కు వచ్చినప్పుడు, ప్రస్తుతమున్న ఆల్బర్ట్‌ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రత్యేక కళాఖండాలన్నీ సేకరించే ఉద్దేశంతో దీని నిర్మాణం వెనకున్న ఉద్దేశం."

-దేవేంద్ర కుమార్ భగత్, చరిత్రకారుడు

రాజస్థాన్‌లో ఉన్న అత్యంత పురాతన మ్యూజియం ఆల్బర్ట్ హాల్. న్యూగేట్‌కు ఎదురుగా ఇండో-అరబిక్ శైలిలో నిర్మితమైన బహుళ అంతస్థుల భవనమిది. సర్ శామ్యూల్ స్వింటన్ జకోబ్ ఈ భవనం డిజైనర్. ఏడవ రాజు ఎడ్వర్డ్ దీనికి ఆల్బర్ట్ హాల్ అని నామకరణం చేశాడు. 1887లో మ్యూజియం ప్రజల సందర్శన కోసం ప్రారంభమైంది.

"ఏడవ కింగ్ ఆల్బర్ట్ 1876లో జైపూర్‌కు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశాడు. అందుకే దీనికి ఆల్బర్ట్ హాల్ అని పేరొచ్చింది. 1887లో ప్రారంభమైంది."

-డా. రాకేశ్ ఛోలక్, ఆల్బర్ట్ హాల్ సూపరింటెండెంట్

ఆల్బర్ట్‌హాల్‌లోని ప్రతి కళాఖండం సందర్శకుల దృష్టిని ఆకర్శిస్తుంది. ఇక్కడ ఉండే 2500 ఏళ్లనాటి ఈజిప్టు మమ్మీ మాత్రం ప్రత్యేక ఆకర్షణ. పురాతన ఈజిప్టు నగరం పనోపోలిస్‌లో జరిపిన తవ్వకాలలో ఈ మమ్మీ బయటపడింది. టూటూ అనే ఓ మహిళ మమ్మీ ఇది. ఆకాలంలో ఈజిప్టులో ఖెమ్ అనే దేవుడిని పూజించేవారట. టూటూ.. ఆ పూజలు చేసే పండితుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా చెబుతారు. 1880లో ఈజిప్టు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం మమ్మీని భారత్‌కు తీసుకొచ్చింది. అప్పటి నుంచీ ఆల్బర్ట్ హాల్‌లోనే భద్రపరుస్తున్నారు.

"ఆల్బర్ట్‌హాల్‌లో ఎక్కువ మంది ఆసక్తిగా తిలకించే వస్తువు ఏదైనా ఉందంటే అది మమ్మీనే. క్రీ.పూ. 322 కాలం నాటిది ఇది. మమ్మీతోపాటు.. క్రీ.పూ. 1622 నాటి పర్షియన్ తివాచీ ఒకటి ఇక్కడ ఉంటుంది. మ్యూజియం మొత్తాన్నీ కొన్ని భాగాలుగా విభజించారు. ఓవైపు శిల్పాలు, నాణేలు, ఆయుధాలు, మట్టిపాత్రలు, లోహ వస్తువులు, పెయింటింగ్స్, టెక్స్‌టైల్స్, కలప వస్తువులు, ఆభరణాలు ఇలా వివిధ రకాల కళాఖండాలను ప్రదర్శనకు ఉంచుతారు. ఆల్బర్ట్ హాల్‌లో మొత్తం మీద 2700 కలాఖండాలు ప్రదర్శనకు ఉన్నాయి. మిగతావన్నీ భద్రపరిచినవి."

-డా. రాకేశ్ ఛోలక్, ఆల్బర్ట్ హాల్ సూపరింటెండెంట్

"లండన్ మ్యూజియంలో లాగే..ఇక్కడా ఓ ఈజిప్షియన్ మమ్మీ ఉంటుంది. 2300 నుంచి 3 వేల ఏళ్లుగా ఓ రకమైన రసాయనపు పూత పూసి దీన్ని భద్రపరుస్తున్నారు. ఆ సమయంలో దీన్నో ప్రత్యేక కళారూపంగా భావించేవారు."

-దేవేంద్ర కుమార్ భగత్, చరిత్రకారుడు

రాజస్థాన్‌లో మ్యూజియంల సంప్రదాయం ఇప్పటిది కాదు. సవాయిజై సింగ్ మహారాజ్ కాలంలో ప్రత్యేక కళాఖండాలు సిటీ ప్యాలెస్‌లో ఉంచేవారు. సవాయి రామ్‌సింగ్ ఆ సంప్రదాయానికి ఆధునిక హంగులు అద్ది, బ్రిటిష్ ప్రభుత్వం సహాయంతో ఈజిప్షియన్ మమ్మీని రాజస్థాన్‌కు తెప్పించాడు. అప్పటినుంచీ రాష్ట్ర పురాతత్వ శాఖకు చెందిన కెమికల్ విభాగం మమ్మీ బాధ్యతలు చూసుకుంటోంది.

"ఈ మ్యూజియంల సంప్రదాయం ఇప్పటిది కాదు. సవాయిజైసింగ్ మహారాజ్ కాలంలో ఇలాంటి కళాఖండాలకు సిటీ ప్యాలెస్‌లో ప్రత్యేక చోటు దక్కేది. మహారాజా సవాయిరామ్‌సింగ్‌ జీ ఈ సంప్రదాయాన్ని ఆధునిక హంగులతో కొనసాగించాడు. లోపల ఓ ఇల్లు కట్టి, దాంట్లో చాలా అరుదైన కళాఖండాలను ఉంచాడు."

దేవేంద్ర కుమార్ భగత్, చరిత్రకారుడు

ఇదీ చూడండి:ఐటీ ఉద్యోగం వీడి.. సేంద్రీయ సాగులోకి..

ABOUT THE AUTHOR

...view details