తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హత్య చేసి తానే చనిపోయినట్లు వృద్ధుడి డ్రామా.. ప్రేయసితో పారిపోయేందుకు.. - ప్రేమ కోసం ఓ వృద్ధుడి ఫేకింగ్ డెత్ న్యూస్

65 ఏళ్ల వృద్ధుడు ప్రేయసితో ఊరు వదిలి పారిపోయేందుకు.. తనకు తెలిసిన మరో వ్యక్తిని హత్య చేశాడు. తానే చనిపోయానని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు దొరికిపోయాడు. మరోవైపు, కేరళలో 17ఏళ్ల బాలికను గుర్తుతెలియని వ్యక్తి హత్య చేశాడు. మహారాష్ట్రలో 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది.

The old man killed another by faking his death, the incident happened due to a love affair in maharashtra
ఓ వ్యక్తిని హత్య చేసి తానే చనిపోయినట్లు సృష్టించిన 65 ఏళ్ల వృద్ధుడు

By

Published : Dec 28, 2022, 9:32 PM IST

Updated : Dec 28, 2022, 10:43 PM IST

మహారాష్ట్ర ఖేడ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 65ఏళ్ల వృద్ధుడు తన ప్రియురాలితో కలిసి ఉండేందుకు ఓ వ్యక్తిని హత్య చేశాడు. చనిపోయింది తానే అన్నట్టు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అనంతరం ప్రేయసితో ఊరు వదిలి పారిపోవాలనుకున్నాడు.

అసలేం జరిగిందంటే..
65 ఏళ్ల సుభాష్ అలియాస్ కర్బా చబన్ థోర్వ్ అనే వృద్ధుడికి ఓ మహిళతో సంబంధం ఉంది. ఆమెతో కలిసి ఎక్కడికైనా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా 45 సంవత్సరాల వయసున్న రవీంద్ర భీమాజీ ఘెనంద్ అనే వ్యక్తిని కర్రతో కొట్టి హత్య చేసి, తర్వాత తల నుంచి మొండెం వేరు చేశాడు. తరువాత చనిపోయిన వ్యక్తి శరీరంపై సుభాష్.. తన దుస్తులను వేసి, మృత దేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి తన పొలంలో పడేశాడు. దీంతో చనిపోయింది తానే అని నమ్మించే ప్రయత్నం చేశాడు. హత్యకు ఉపయోగించిన వస్తువులను ధ్వంసం చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు సుభాష్. డిసెంబర్ 16న ఈ ఘటన జరిగింది.

తల లేని మృతదేహాన్ని పొలంలో కనుగొన్న సుభాష్ కుటుంబ సభ్యులు.. ఆ డెడ్​బాడీపై ఉన్న దుస్తులు చూసి చనిపోయింది సుభాషే అని భావించారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో దశకర్మ కూడా జరిపించారు. అయితే హత్యపై విచారణ జరిపిన పోలీసులు.. సీసీటీవీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. హంతకుడు సుభాషేనని తేలింది. దీంతో సోమవారం రాత్రి సుభాష్​ను అరెస్టు చేశారు. అతడిని ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన పరికరాలు, మృతుడి తల కోసం గాలిస్తున్నారు.

కేరళలో దారుణం..
కేరళ తిరువనంతపురంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల ఓ బాలికను ఎవరో గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగీత అనే కళాశాల విద్యార్థినిని.. దుండగుడు అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు పిలిచి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు, కేకలు విన్న కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను గుర్తించారు. వెంటనే ఆ బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఈ కేసులో.. మృతురాలి ప్రియుడు గోపు(20)ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొబైల్ ఫోన్ వివరాలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా గోపును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. "ఈ హత్యపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశాం. ఈ ఘటనకు గల సరైన కారణాన్ని త్వరలోనే తెలుసుకుంటాం. జంట మధ్య సంబంధాలు చెడిపోవడం ఈ నేరానికి దారితీసి ఉండవచ్చు. ప్రస్తుతానికి ఏ వివరాలనూ కచ్చితంగా చెప్పలేం" అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

బాలికపై గ్యాంగ్​రేప్
మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరుగురిని చతుశృంగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఫిర్యాదు చేసిన మహిళ కుమార్తె మైనర్ అని తెలిసినప్పటికీ.. నిందితులలో ఒకడు ఆ బాలికను కత్తితో బెదిరించి తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన నిందితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. 2022 జూలై, డిసెంబర్ మధ్య ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. చతుశృంగి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

యువకుడు ఆత్మహత్య
జుట్టు రాలుతోందని బాధపడుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హరియాణా కర్నాల్‌లోని పింగ్లీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కల్పనా చావ్లా మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

అసలేం జరిగిందంటే..
జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడ్డ పంకజ్(17) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జనవరి 22న పంకజ్ పుట్టినరోజు అని, అతనికి 18 ఏళ్లు నిండుతాయని బంధువులు చెప్పారు. జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్న ఆ యువకుడికి చాలా సార్లు కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.

Last Updated : Dec 28, 2022, 10:43 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details