గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం జరిగిన ట్రక్కు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు. సూరత్‌లోని కోసంబ ప్రాంతంలో నిద్రిస్తున్న కూలీలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 15 మంది మృతిచెందారు.