Digital News Regulation: డిజిటల్ మీడియాను నియంత్రించే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందులోనే మొదటిసారి డిజిటల్ వార్త సైట్లను చేర్చనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ మీడియాలో ఆ సైట్లను భాగం చేస్తూ..రిజిస్ట్రేషన్ల నిమిత్తం కొత్త చట్ట సవరణను చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఒకసారి ఈ సవరణ బిల్లు గనుక ఆమోదం పొందితే.. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వార్తలు అందించే డిజిటల్ సైట్లు చట్ట పరిధిలోకి వస్తాయి. దాంతో ఉల్లంఘనలకు పాల్పడిన వార్తా సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. పెనాల్టీ విధించడం, రిజిస్ట్రేషన్ రద్దు చేయడం వంటి నిబంధనలు అమలవుతాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియను సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దానిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లులో సవరణలు తేనుంది.