తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోడలిపై అత్తమామల చిత్రహింసలు.. కత్తితో పొడిచి.. ప్రైవేట్​ పార్టుల్లో కర్రను పెట్టి.. - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు

కొడుకు కులాంతర వివాహం చేసుకోవడం ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో వేరే కులానికి చెందిన అమ్మాయి అని చెప్పి కోడల్ని తరచూ దూషించేవారు. మంగళవారం మరో కొడుకుతో కలిసి ఆమెను దారుణంగా కొట్టి.. కత్తితో పొడిచారు అత్తమామలు. ఆ తర్వాత కర్రను ఆమె రహస్యభాగంలో పెట్టి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

the in laws put a stick in the private part of the daughter in law in devriya
the in laws put a stick in the private part of the daughter in law in devriya

By

Published : Jul 22, 2022, 8:35 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని దేవరియా జిల్లాలో అతిదారుణమైన వెలుగు చూసింది. కోడలు వేరే కులానికి చెందిన అమ్మాయి అని ఆమె అత్తమామలు, బావ కలిసి తీవ్రంగా దూషించి కత్తితో పొడిచారు. ఆ తర్వాత ఆమె రహస్య భాగంలో కర్రను పెట్టి నరకం చూపించారు. దీంతో బాధితురాలు స్పృహ తప్పిపడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ జరిగింది.. జిల్లాలోని మదన్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్న ఓ యువకుడు.. ఎనిమిదేళ్ల క్రితం దిల్లీకి చెందిన​ ఓ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వారద్దిరి వివాహ బంధానికి గుర్తుగా ఓ అమ్మాయి కూడా జన్మించింది. వివాహం అయిన నాటి నుంచి బాధితురాల్ని అత్తింటి వారు.. వేరే కులానికి చెందిన అమ్మాయివంటూ తీవ్రంగా వేధించేవారు. యువకుడ్ని రెండో వివాహం చేసుకోమని కూడా ఒత్తిడి తెచ్చేవారు.

భార్యభర్తలిద్దరూ దిల్లీలో ఆన్​లైన్​ కూరగాయల వ్యాపారం చక్కగా చేసుకునేవారు. కానీ కొన్ని కారణాల వల్ల వ్యాపారం కుప్పకూలి.. ఉత్తర్​ప్రదేశ్​లోని ఇంటికి చేరుకున్నారు. దీంతో మునుపటి కంటే గొడవలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి.. బాధితురాలిపై ఆమె అత్తమామలు, బావ కలిసి దారుణంగా దాడి చేశారు. రెండు చేతులను తాడుతో కట్టి.. ఆ తర్వాత అతి కిరాతకంగా కత్తితో పొడిచారు. అంతటితో ఆగకుండా బాధితురాలి రహస్య భాగంలో కర్రను పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఒక్కసారిగా బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది.

వెంటనే బాధితురాలి భర్త.. పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే తన మేనమామ కిసాన్ మోర్చా నాయకుడు అని, అందుకే తన తల్లిదండ్రులను అరెస్టు చేయడం లేదని బాధితురాలి భర్త ఆరోపించాడు.

ఇవీ చదవండి:డిప్యూటీ కలెక్టర్​కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు

కొరడాతో కొట్టించుకున్న మహిళలు.. అలా జరగాలనే!

ABOUT THE AUTHOR

...view details