hotel owner killed beggars : మహారాష్ట్ర పుణెలో అమానుష ఘటన జరిగింది. ముగ్గురు బిచ్చగాళ్లపై వేడినీళ్లు పోసి హత్య చేశాడు ఓ హోటల్ నిర్వాహకుడు. హోటల్ ముందు కూర్చోవద్దని చెప్పినా వినకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన జయవంత్.. కర్రలతో కొట్టి తర్వాత వేడి నీళ్లు పోశాడు. తీవ్ర గాయాలపాలైన బిచ్చగాళ్లు మరణించారు. ఈ ఘటన మే 23న సస్వాద్లో జరగగా.. మే 30న కేసు నమోదు చేశారు పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే నిందితుడిని వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ జరిగింది: అహల్యాదేవి మార్కెట్ సమీపంలో నీలేశ్ జయవంత్ జగ్తాప్ ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు దాని ఎదుట ముగ్గురు బిచ్చగాళ్లు కూర్చుంటున్నారు. అక్కడ నుంచి వెళ్లమని చెప్పి వారిని కర్రతో కొట్టాడు. అయినా బిచ్చగాళ్లు అక్కడ నుంచి వెళ్లలేదు. దీంతో ఆగ్రహానికి గురైన జయవంత్ హోటల్లోని వేడి నీళ్లను తెచ్చి వాళ్లపై పోశాడు. తీవ్ర గాయాలపాలైన బిచ్చగాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.