తెలంగాణ

telangana

ETV Bharat / bharat

HC on Lokesh bail petition : 'స్కిల్‌ కేసు'లో లోకేశ్​ను వచ్చే నెల 4 వరకు అరెస్టు చేయొద్దన్న హైకోర్టు

HC_on_Lokesh_bail_petition
HC_on_Lokesh_bail_petition

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 3:11 PM IST

Updated : Sep 29, 2023, 3:46 PM IST

15:08 September 29

HC on Lokesh bail petition ఫైబర్‌నెట్‌ కేసులో బెయిల్ పిటిషన్‌ విచారణ 4కు వాయిదా

HC on Lokesh bail petition : నారా లోకేశ్​కు తాత్కాలిక ఊరట కలిగింది. స్కిల్‌ డెవలప్​మెంట్ కేసులో లోకేశ్ వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... లోకేశ్​ను వచ్చే నెల 4 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఇక ఫైబర్‌నెట్‌ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 4కు హైకోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తున్నారు.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ.. ఇటీవలే లోకేశ్ పేరును చేర్చింది. ఈ మేరకు సీఆర్​పీసీ (CRPC) 41A ప్రకారం లోకేశ్ కు ముందస్తు నోటీసులు ఇస్తామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ హైకోర్టుకు తెలపగా... అరెస్టు గురించి ఆందోళన లేనందున ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసుల్లో లోకేశ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయగా.. స్కిల్ కేసులో ఈ నెల 4వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఫైబర్‌నెట్‌ కేసుకు సంబంధించిన విచారణ వచ్చే నెల 4న విచారించనుంది.

Last Updated : Sep 29, 2023, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details