Unnav Marriage Cancel: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ పెళ్లికొడుకు ఆడిన ఒకే ఒక అబద్ధం ఆ వివాహాన్నే ప్రశ్నార్థకం చేసింది. పెళ్లి తంతులో వరుడి విగ్గు ఊడి వివాహమే రద్దు అయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగింది. వరుడికి జుట్టు లేదన్న నిజాన్ని తెలుసుకున్న వధువు పెళ్లికి నిరాకరించింది. దీంతో వివాహ తంతు అర్థాంతరంగా ముగిసిపోయింది. వరుడి పెళ్లి కల చెదిరిపోయింది.
వరుడి విగ్గు ఊడటం చూసి వధువు షాక్.. పెళ్లి అర్థాంతరంగా రద్దు - groom wig news
Groom hair wig: కాసేపట్లో పెళ్లి అనగా వరుడి విగ్గు ఊడిపోయింది. అతని బట్టతల చూసి వధువు షాక్ అయింది. దీంతో పెళ్లికి నిరాకరించింది. ఫలితంగా వివాహం అర్థాంతరంగా రద్దు అయింది. ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో ఈ ఘటన జరిగింది.
జయమాల వేడుక అనంతరం ఉన్నట్టుండి పెళ్లికొడుకు స్పృహ తప్పిపడిపోయాడు. అతడ్ని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు మొహంపై నీళ్లు చల్లాడు. తలపాగా తీసే క్రమంలో వరుడు విగ్గు ఊడిపోయింది. దీంతో పెళ్లి కూతురు బంధువులు షాకయ్యారు. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది. మోసం చేసి పెళ్లి చేయాలని చూశారని పెళ్లి కూతురు బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన వారు ఇరు కుటుంబాలను శాంతింపజేెశారు. అయితే అధికారికంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఒక వేళ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:దళితుడి నోట్లోని ఆహారాన్ని తీయించుకొని తిన్న ఎమ్మెల్యే!