మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఇప్పటిదాకా కేరళను వణికిస్తూ వచ్చిన ఈ వ్యాధి.. పుణెలో ఓ 50ఏళ్ల మహిళకు సోకినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
మరో రాష్ట్రానికి పాకిన జికా వైరస్ - పుణె
కేరళలో కలకలం రేపుతున్న జికా వైరస్.. మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలో శనివారం తొలి జికా కేసు నమోదైంది.
జికా వైరస్
కాగా, కేరళలో మరో ఇద్దరు జికా బారినపడ్డారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 63కు చేరగా, ప్రస్తుతం 3 యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు.
ఇదీ చూడండి:జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?