తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లల కోసం బొమ్మల లైబ్రరీ- యాప్​లో ఆర్డర్ చేస్తే​ ఉచితంగా హోమ్​ డెలివరీ! - ఇండియాలో టాయ్స్ లైబ్రరీ

The Elefant Toys Library In Mumbai : తన కుమార్తె ఇష్టపడిన బొమ్మలు దొరకపోవటం వల్ల ఓ తండ్రి.. ఏకంగా టామ్స్ లైబ్రరీనే ప్రారంభించాడు. అందులో తన కూతురుకు కావాల్సిన వివిధ రకాల బొమ్మలను చేసి పెట్టాడు. ఇలా తన కుమార్తె కోసం ప్రారంభించిన లైబ్రరీ.. మిగతా పిల్లలకు కూడా పంపించటం మొదలు పెట్టాడు. ఇంతకీ ఎన్ని చోట్ల ఈ లైబ్రరీలు పెట్టాడు. వినూత్నంగా బొమ్మల లైబ్రరీని ప్రారంభించిన వ్యక్తి ఎవరో తెలుసుకుందాం.

The Elefant Toys Library In Mumbai
The Elefant Toys Library In Mumbai

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 10:26 PM IST

పిల్లల కోసం బొమ్మల లైబ్రరీ

The Elefant Toys Library In Mumbai : లైబ్రరీ అంటే పుస్తకాలు ఉంటాయి. ఇలా చాలా మంది తమకు నచ్చిన బుక్స్​ కోసం వెళ్తుంటారు. అలానే పిల్లలకు కావాల్సిన బొమ్మల కోసం కూడా ఓ లైబ్రరీ ఉంది. అదే 'ది ఎలిఫెంట్ టాయ్స్ లైబ్రరీ'. దీనిని ముందుగా తన కుమార్తె కోసం ప్రారంభించాడు ఓ తండ్రి. ఈ లైబ్రరీలో తన కూతురుకు కావాల్సిన వివిధ రకాల బొమ్మలను పెట్టాడు. తర్వాత తన కూతురుతో పాటు మిగతా పిల్లలు కూడా ఈ బొమ్మలను అందిస్తున్నాడు. అతడే ముంబయిలోని మాలాడ్​ ప్రాంతానికి చెందిన సౌరభ్ జైన్..

ది ఎలిఫంట్ టాయ్స్ లైబ్రరీ

తన కూతురు ఇష్టపడిన బొమ్మలు దొరక్కపోవటం వల్ల కలత చెందిన సౌరభ్.. స్వయంగా కుమార్తె కోసం వివిధ రకాల బొమ్మలను తయారు చేయటం ప్రారంభించాడు. అలా బొమ్మల కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 14 నగరాలకు విస్తరించింది. తన కుమార్తె లాగానే మిగతా పిల్లలకు కూడా వాళ్లకి కావాల్సిన బొమ్మలను.. పొందటం కోసం ఒక మొబైల్​ యాప్​ను ప్రారంభించాడు. దాని సాయంతో పిల్లల ఇంటికి తక్కువ ధరలకే ఉచితంగా డెలివరీ చేస్తున్నాడు.

టాయ్స్​ లైబ్రరీలోని బొమ్మలతో ఆడుకుంటూ

" పిల్లలను కచ్చితంగా బొమ్మలతో ఆడుకోనివ్వాలి. మా లైబ్రరీ నుంచి మీరు ఎప్పుడైనా బొమ్మలను తీసుకోవచ్చు. మా దగ్గరున్న ప్రతి వస్తువును శానిటైజ్​ చేస్తాము. దీని వల్ల మీరు మీ పిల్లలను రోజుకో కొత్త బొమ్మలతో ఆడుకోనివ్వచ్చు."

--సౌరభ్, ది ఎలిఫెంట్ టాయ్స్ యాజమాని

ఈ బొమ్మల కోసం 'ది ఎలిఫెంట్ టాయ్స్​' అనే యాప్​లో ఇంటి అడ్రాస్​లను ఇస్తే చాలు మనుకు బొమ్మలను ఉచితంగా హోమ్​ డెలవరీ చేస్తారు. బొమ్మలను కొనడం కోసం సబ్​స్క్రిప్షన్​ ఉంటాయి. అతి తక్కువ ధరలకే బొమ్మలను పిల్లలకు అందిస్తున్నమని సౌరభ్ తెలిపాడు. విరిగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని బొమ్మలను డెలవరీ చేస్తున్నమని సౌరభ్ తెలిపాడు.'ది ఎలిఫెంట్ టాయ్స్ లెబ్రరీ'కి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తమ పిల్లలు సంతోషంగా బొమ్మలతో ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.

లైబ్రరీ యాజమాని సౌరభ్

" ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి. దీనివల్ల చిన్నారుల స్క్రీన్​ టైమ్​ కూడా తక్కువైంది. వాళ్లు ఇంట్లో చక్కగా ఆడుకుంటున్నారు. నేను కూడా పిల్లలతో సమయాన్ని గడుపగలుగుతున్నాను. బయట ఇలాంటి వస్తువులు అంతా ఈజీగా దొరకవు. వీళ్ల దగ్గర మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మనం ఆర్డర్​ పెట్టిన వెంటనే వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలు తమంతట తామే ఈ ప్యాకేజ్​ను ఓపెన్ చేస్తున్నారు. చాలా సేఫ్​ ప్యాకేజింగ్​ చేస్తారు." -రసేష్ ఠాకోర్

తన కూతురు కోసం మొదలుపెట్టిన ఈ 'ది ఎలిఫెంట్ టాయ్స్ లైబ్రరీ' నుంచి.. ఇప్పుడు చాలా మంది తమ పిల్లల కోసం బొమ్మలను తీసుకోవటం సంతోషంగా ఉందని తెలిపాడు సౌరభ్.

లైబ్రరీలో ఆడుకుంటున్న పిల్లలు

Unique Children Library : పనికిరాని వస్తువులతో లైబ్రరీ.. మురికివాడ పిల్లలకు పుస్తకాలను పరిచయం చేసిన బాలిక

ఒకప్పుడు తాగుబోతుల అడ్డా.. ఇప్పుడు గ్రంథాలయం.. 'ట్రీ లైబ్రరీ'తో మారిన రూపురేఖలు

ABOUT THE AUTHOR

...view details