మహిళా దినోత్సవం జరపుకొనేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. అందుకు ఒక రోజు ముందు.. ఓ రైలు ఛోదకుడు ప్రవర్తించిన తీరు మహిళా లోకాన్ని కలచి వేసింది. తాను నడిపే రైలులో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మహిళ ఉందన్న కారణంగా విధుల్లోకి రాబోనని తెలిపాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్ డివిజన్ నార్త్-వెస్ట్ రైల్వే పరిధిలో శనివారం జరిగింది.
అసిస్టెంట్‌గా మహిళ ఉందని రైలు నడిపేందుకు లోకోపైలట్ నిరాకరణ - జైపూర్
అసిస్టెంట్ లోకో పైలట్‌గా మహిళ ఉందని రైలును నడపడానికి నిరాకరించాడో లోకోపైలట్. రాజస్థాన్‌లోని జైపూర్ డివిజన్ నార్త్-వెస్ట్ రైల్వే పరిధిలో ఈ ఘటన జరిగింది. మహిళా దినోత్సవానికి ముందు రోజే ఈ పరిణామం జరగటం గమనార్హం.
![అసిస్టెంట్‌గా మహిళ ఉందని రైలు నడిపేందుకు లోకోపైలట్ నిరాకరణ The driver refused to run the train, because the assistant loco pilot was a woman.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10912303-207-10912303-1615134861173.jpg)
అసిస్టెంట్లోకోపైలట్గా మహిళ- రైలునడపని లోకో పైలట్