తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Emergency: 'నాటి చీకటి రోజులను మరువలేం' - అత్యవసర పరిస్థితి

దేశంలో ఇదే రోజున అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చిన క్రమంలో ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమన్నారు.

PM Modi
ప్రధాని మోదీ

By

Published : Jun 25, 2021, 11:03 AM IST

దేశంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులను మరువలేమన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

పీఎం మోదీ ట్వీట్​

"ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులను ఎప్పటికీ మరిచిపోలేం. వ్యవస్థలను పద్ధతి ప్రకారం ఏ విధంగా నాశనం చేశారో 1975 నుంచి 1977 మధ్య కాలమే చెబుతుంది. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవనం సాగిద్దాం. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ.. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పాటుపడిన ప్రతిఒక్క వీరుడిని గుర్తు చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'

ABOUT THE AUTHOR

...view details