కాంగ్రెస్ అధ్యక్ష మార్పు వ్యవహారంపై పార్టీ కసరత్తు ప్రారంభించింది. దీనిపై.. ఒకటి రెండు రోజుల్లోనే పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) భేటీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
గత నెలలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకత్వ మార్పే కీలకంగా చర్చ జరిగింది. ముఖ్యంగా సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని పలువురు సీనియర్ నేతలు పట్టుబట్టారు. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆలోచించాలని నేతలు కోరారు. స్పందించిన రాహుల్.. పార్టీ ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు సిద్ధమేనని అప్పుడే స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే అధ్యక్ష మార్పు విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఖరారు చేసింది. ఏఐసీసీ సభ్యులుగా ఎన్నికైన వారంతా.. అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.