వేర్వేరు ప్రాంతాల్లో అభివృద్ధి చెందే ఫంగస్ల రంగులు భిన్నంగా ఉంటాయన్నారు దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మ్యూకోర్మైకోసిస్, క్యాడిడా, ఆస్పోరోజెనస్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ ఫంగస్‌లు ప్రధానంగా సైనస్, ముక్కు, కళ్ల చుట్టూ ఉండే ఎముకలలో కనిపిస్తాయని తెలిపారు గులేరియా. మెదడులోకి ప్రవేశించగలవని చెప్పారు. అరుదుగా ఊపిరితిత్తులు, జీర్ణాశయ పేగుల్లో కనిపిస్తాయని వెల్లడించారు.
మరోవైపు.. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతోందని వివరించారు.