రోజూవారి ఆహారంలో కోడిగుడ్డు ఉంటే కొంతమంది ఎంతో ప్రియంగా భుజిస్తారు. కొందరు ఉడికించిన గుడ్డును కాకుండా ఆమ్లెట్కు ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. అలా ఆమ్లెట్ వేయాలంటే గుడ్డును పగలకొట్టి పెనం మీద తయారు చేసుకోవాలి. అలా ఓ వ్యక్తి గుడ్డు పగలగొట్టగానే అందులోంచి కోడిపిల్ల వచ్చింది.
ఈ సంఘటనతో ఆశ్చర్యానికి గురైన ఆ వ్యక్తి.. వెంటనే కోడిపిల్లను పెనంపై నుంచి తీసేశాడు. అయితే కోడిగుడ్డు పగలకొట్టిన తర్వాత వెంటనే పిల్ల ఎలా వచ్చిందంటూ మీకూ అనుమానం కలిగిందా? అయితే నెట్టింట వైరల్గా మారిన ఆ వీడియో చూసేయండి.