గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని రాజ్‌పథ్‌లో రైతు సంఘాలు నిర్వహించదలచిన ట్రాక్టర్ల కవాతును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దిల్లీ పోలీసు విభాగం ద్వారా పిటిషన్ దాఖలు చేయించింది. గణతంత్ర వేడుకలకు విఘాతం కలిగించేందుకు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు ట్రాక్టర్ల కవాతును నిర్వహించాలని కొన్ని వర్గాలు భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ చర్య యావత్తు దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుంది వివరించింది. ఏటా గణతంత్ర దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం రాజ్యాంగపరమైన, చారిత్రకపరమైన ఆవశ్యకతను కలిగి ఉందని తెలిపింది.
రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీంకు కేంద్రం - గణతంత్ర దినోత్సవ వేడుకలు దిల్లీ
ఈనెల 26న రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ల కవాతు జరగకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గణతంత్ర దినోత్సవం కారణంగా రాజధానిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆ పిటిషన్లో పేర్కొంది.
రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీంకు కేంద్రం
26వ తేదీకి మూడు రోజుల ముందు నుంచే రిహార్సల్స్ జరుగుతాయి. కనుక దేశ రాజధాని ప్రాంతంలో ఏ రూపంలోనూ నిరసనలు, ధర్నాలు, కవాతులు నిర్వహించకుండా నిలువరించాలి అని దిల్లీ పోలీసు విభాగం సుప్రీంకోర్టుకు విన్నవించింది.