Petrol Price: పెట్రో ధరల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రభాగాన ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పెట్రో ధరలపై పార్లమెంటుకు నివేదించిన కేంద్రం.. ఏపీలో పెట్రోల్ ధర రూ.111.87, డీజిల్ ధర రూ.99.61 ఉన్నట్లు తెలిపింది. పెట్రోల్ ధరల్లో తొలి స్థానం, డీజిల్ రెండో స్థానంలో నిలవగా, డీజిల్ ధరల్లో లక్షద్వీప్ తొలి స్థానంలో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒకే చమురు ధరల విధానం ఇప్పటివరకు లేదన్న కేంద్రం.. రాష్ట్రాల పన్నుల ఆధారంగా చమురు ధరలు ఉన్నాయని వివరించింది. ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను అమరావతి కేంద్రంగా సేకరించామన్న కేంద్రం.. రిఫరెన్స్ సిటీగా అమరావతిని పేర్కొన్నట్లు తెలిపింది. తెలంగాణలో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82 ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
petro price: పెట్రో ధరల్లో దేశంలో అగ్రభాగాన నిలిచిన ఆంధ్రప్రదేశ్
పెట్రోల ధరల్లో ఏపీ నంబర్ వన్
14:29 July 20
ఏపీలో పెట్రోల్ రూ.111.87, డీజిల్ రూ.99.61: కేంద్రం
Last Updated : Jul 20, 2023, 3:15 PM IST