రహదారుల ప్రమాదానికి కారణాలను విశ్లేషించడం, బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంపై ఐఐటీ-మద్రాసు రూపొందించిన (integrated road accident database) విధానాన్ని కేంద్రం ఆమోదించింది. దీన్ని 27 రాష్ట్రాలు, అయిదు కేంద్రపాలిత ప్రాంతాలు అమల్లోకి తెచ్చాయి.
రహదారి భద్రతకు 'ఐరాడ్'.. దేశవ్యాప్తంగా అమలులోకి! - ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డాటాబేస్
రోడ్డు ప్రమాదాలపై ఐఐటీ-మద్రాసు రూపొందించిన (integrated road accident database) విధానాన్ని కేంద్రం ఆమోదించింది. దీన్ని 27 రాష్ట్రాలు, అయిదు కేంద్రపాలిత ప్రాంతాలు అమల్లోకి తెచ్చాయి. 'ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డాటాబేస్' (ఐరాడ్) మొబైల్ అప్లికేషన్ ద్వారా రహదారుల ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించనున్నారు.
'ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డాటాబేస్' (ఐరాడ్) పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను (irad app) ఐఐటీ-మద్రాసు రూపొందించింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ వివరాలు, ఫొటోలు, వీడియోలను పోలీసు అధికారులు తొలుత దీంట్లో పొందుపరుస్తారు. దీనికి ప్రత్యేకంగా ఒక ఐడీ నెంబరు ఇస్తారు. అనంతరం సంబంధిత ఇంజనీరు సెల్‌కు సమాచారం అందుతుంది. వారు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి రోడ్డు నిర్మాణంలోని లోపాలు ఎంతవరకు కారణమన్నదాన్ని పరిశీలిస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే సమాచారాన్ని ఐఐటీ-మద్రాసులో విశ్లేషణ జరిపి తగిన సూచనలు ఇస్తారు.
ఇదీ చదవండి:'అలాంటి భర్తకు విడాకులు సబబే'