YS viveka murdetr case : వివేకానంద రెడ్డి హత్యకేసు తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 28కి వాయిదా వేసింది. నిందితుల్లో ఒకరైన శివశంకర్ భార్య తులసమ్మ.. బెయిల్ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం విదితమే. విచారణ సందర్భంగా.. కేసును ఇంకా ఎన్నాళ్లు కొనసాగదీస్తారంటూ న్యాయమూర్తి సీబీఐను ప్రశ్నించగా.. కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీబీఐ వివరించింది. ఈ మేరకు పాత అధికారి రాంసింగ్‌ను కొనసాగిస్తూనే పలువురు అధికారుల పేర్లను వెల్లడించింది. అయితే, రాంసింగ్ కొనసాగింపులో అర్ధం లేదని పేర్కొన్న న్యాయమూర్తి.. ఏప్రిల్ 30 లోగా కేసును తేల్చాలంటూ సీబీఐ అధికారులను ఆదేశించారు.
బెయిల్ పిటిషన్ పై విచారణ... ఇదిలా ఉండగా మరోవైపు ఎర్రగంగిెరెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. కాగా, గంగిరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సమయం సీబీఐ సిట్ బృందం గడువు కోరగా, తదుపరి విచారణ ఏప్రిల్ 12కు కోర్టు వాయిదా వేసింది.
28కి వాయిదా వేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు నలుగురు నిందితులు సీబీఐ న్యాయస్థానంలో హాజరయ్యారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్, దేవిరెడ్డి శివశంకర్‌ను పోలీసులు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు. బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు వచ్చాడు. దస్తగిరి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ మేరకు గైర్హాజరు పిటిషన్ వేశాడు. వివేకా హత్య కేసులో ఏర్పాటైన సిట్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేసినట్లు, దర్యాప్తు అధికారిని మార్చినట్లు సీబీఐ తరఫు న్యాయవాది, కోర్టుకు తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేశారని... వీలైనంత త్వరలో అభియోగపత్రం దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ.. సీబీఐ న్యాయవాదికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏప్రిల్ 30 లోగా తేల్చాలన్న సుప్రీం.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 5 ముద్దాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ కోరుతూ అతడి భార్య తులశమ్మ వేయగా.. కేసును ఇంకా ఎన్నాళ్లు కొనసాగదీస్తారంటూ న్యాయమూర్తి సీబీఐని ప్రశ్నించారు. దీంతో సీబీఐ కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తొలగిస్తూ కొత్త సిట్‌ను ప్రకటించగా.. ఏప్రిల్ 30 లోగా తేల్చాలని కోర్టు ఆదేశించింది.
ఇవీ చదవండి :