తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దిశ' తరహాలో మరో కిరాతకం! యువతిని చంపి, నిప్పంటించి.. - కెంగేరి పోలీస్ స్టేషన్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'దిశ హత్యాచారం' తరహా ఘటన కర్ణాటక​లో జరిగింది. గుర్తు తెలియని మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది. ఇది హత్య లేదా హత్యాచారమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

burned body bengaluru
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

By

Published : Jul 4, 2022, 12:59 PM IST

రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో జరిగిన దిశ తరహా ఘటన కర్ణాటక.. కెంగేరీ పోలీస్​ స్టేషన్​లోని రామసంద్రలో జరిగింది. గుర్తు తెలియని మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం కనిపించింది. మృతురాలి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మహిళపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

మృతురాలి దుస్తులు పోలీసులకు లభ్యం

ఈ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం వల్ల ఈ దారుణం బయటపడింది. ఘటనా స్థలంలో మహిళ దుస్తులు లభ్యమయ్యాయి. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details