జీవితంలో ఒక్కసారే కదా పెళ్లి చేసుకుంటామని అని ఉన్నంతలో కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తుంటారు. స్తోమత ఉన్నవారైతే వివాహం వైవిధ్యంగా ఉండాలని విదేశాలకు వెళ్లడమో లేదంటే.. కొత్తగా ఉంటుందని సముద్రంలో షిప్‌పై పెళ్లి చేసుకోవడమో లాంటివి చేస్తుంటారు. మరి కొందరు గాల్లో తేలియాడుతూ పెళ్లి చేసుకుంటారు. కానీ, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన వధూవరులు ఇంకాస్త భిన్నంగా ఆలోచించారు. ఇరువైపుల నుంచి వచ్చే అతిథుల కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేశారు.
పెళ్లి కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసిన జంట... వీడియో వైరల్
పెళ్లి కోసం ఓ జంట ఏకంగా విమానాన్నే బుక్ చేసింది. పెళ్లికొచ్చిన బంధువులతో కలిసి విమానంలో కూర్చొని సందడి చేసింది ఆ కొత్త జంట. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పెళ్లి కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసిన జంట
అందరూ విమానంలో కూర్చొని కేరింతలు కొడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రేయ సాహ్ అనే డిజిటల్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. మరోవైపు యూజర్లు రకరకాలుగా కామెంట్లు గుప్పిస్తున్నారు. 'మీరు ధనవంతులని చెప్పకనే చెప్తున్నారుగా' అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. 'మా ఇంట్లో ఇలాంటి వాటిని అంగీకరించరు' అని మరో యూజర్ బదులిచ్చారు.