Boy Kept Room With 22 Dogs: మహారాష్ట్రలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుణెలోని ఓ భార్యాభర్తలు తమ 11 ఏళ్ల కుమారుడిని.. 22 కంటే ఎక్కువ కుక్కలు ఉన్న గదిలో రెండేళ్లుగా బంధించి దారుణంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. కుక్కలు ఉన్న ఆ గది నుంచి ఆ పిల్లాడికి విముక్తి కల్పించారు.
షాక్ అయిన అధికారులు.. సంజయ్ లోధారియా, శీతల్ లోధారియా దంపతులు కోంధ్వాలో కృష్ణై భవనంలో నివసిస్తున్నారు. వీరి ఇంట్లో 20 నుంచి 22 కుక్కలు ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా వారి కుమారుడు కుక్కలు ఉన్న గదికే పరిమితమయ్యాడు. రానురాను ఆ బాలుడు కూడా గది కిటికీ వద్ద కూర్చుని కుక్కలా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ అపర్ణ మోదక్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెళ్లిన అధికారులు షాకయ్యారు. బాలుడు ఆ సమయంలో కుక్కలు ఉన్న గదిలోనే ఉన్నాడు. అతడి చుట్టూ 20 నుండి 22 కుక్కలు కనిపించాయి. దీంతో కోంధ్వా పోలీస్ స్టేషన్‌లో అధికారులు కేసు నమోదు చేశారు.