వింగ్‌లూంగ్ డ్రోన్లు భారత భూభాగంలోకి తొంగిచూస్తే కూల్చేస్తామని సైన్యం హెచ్చరించింది. చైనా తన సైనిక అవసరాల కోసం తయారు చేసిన వింగ్‌లూంగ్ సాయుధ డ్రోన్లు పాకిస్థాన్‌కు విక్రయించింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, లద్దాఖ్‌లోని వాస్తవాధీనరేఖ వద్ద గగనతలాన్ని రాడార్లు చాలా నిశితంగా పరిశీలిస్తాయని, వాటిని ఎదుర్కొంటాయని సైనికాధికారులు తెలిపారు. సాయుధ డ్రోన్లు గీత దాటితే సులువుగా కూల్చివేయవచ్చని మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వింగ్‌లూంగ్.. గీతదాటితే ఇట్టే కూల్చేస్తాం..! - bjp
సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతూ ప్రస్తుతం వెనక్కి తగ్గిన చైనా.. పాక్‌ను మనపై ఎగదోసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి శత్రువును టార్గెట్ చేయగల సత్తా ఉన్న వింగ్‌లూంగ్ సాయుధ డ్రోన్లను సమకూర్చింది. అయితే.. ఇవి భారత భూభాగంలోకి తొంగిచూస్తే కూల్చేస్తామని సైన్యం హెచ్చరించింది.
మానవరహిత వైమానిక వాహనాలు, నియంత్రణ రేఖ వద్ద లేదా వాస్తవాధీనరేఖ దాటకుండా గగనతలం నుంచి భూమిపైకి ఆయుధాలను ప్రయోగించేందుకు దోహదపడతాయి. వింగ్‌లూంగ్ సాయుధ డ్రోన్ల గురించి చైనా, పాక్ ఎంత ప్రచారం చేసినా వాటిని సులభంగా కూల్చివేస్తామని సైన్యం ప్రకటించింది.
ఇదీ చూడండి:'భాజపా వ్యతిరేక పార్టీలు ఏకమైతేనే బలమైన ప్రతిపక్షం'