India China bridge Pangong lake: తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న రెండో వంతెన ఆ దేశ ఆక్రమిత ప్రాంతంలో ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడ చాలా సంవత్సరాలుగా చైనా నిర్మాణాలు చేస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. అది సైనికపరమైన అంశం అని తెలిపారు. వివాదాస్పద అంశాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయని, అందుకు ప్రయత్నాలు చేస్తుంటామని వివరించారు. ద్వైపాక్షిక, సైనిక మార్గాల్లో చర్చలు జరుగుతాయని అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
"ఎల్‌ఏసీ అంశంపై భారత్, చైనా మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. చైనా విదేశాంగ మంత్రి కూడా భారత్ వచ్చారు. ఆయనతో కూడా చర్చలు జరిగాయి. మా ఆకాంక్షలను ఆయన ముందు ఉంచాం. చర్చలను ముందుకు తీసుకువెళతాం. చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. చైనా వంతెన నిర్మాణంపై వార్త చూశాం. వంతెన ఉన్న ప్రాంతాన్ని చైనా ఆక్రమిత ప్రాంతంగా మేం భావిస్తాం. అది సైనికపరమైన అంశం. దీనిపై మరిన్ని వివరాలు రక్షణ శాఖే ఇవ్వగలదు."
-అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి