కొవిడ్-19పై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. శ్వేత పత్రం లక్ష్యం.. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం కాదని.. కరోనా మూడో దశ దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసేందుకు అని తెలిపారు. దేశంలోకి కొవిడ్ థర్డ్ వేవ్ రానుందని ప్రజలకు తెలుసని వివరించారు. దేశంలో కరోనా మొదటి, రెండో దశను అడ్డుకోవటంలో కేంద్రం విఫలమైందన్నారు.
కొవిడ్ వైరస్ పరివర్తనం చెందుతున్న క్రమంలో భవిష్యత్తులో మరిన్ని వేవ్‌లు రావొచ్చని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కేంద్రం చర్యలేవి?
దేశంలో థర్డ్ వేవ్ రానుందని దేశం మొత్తం తెలుసని.. ఈ క్రమంలో కేంద్రం సమాయత్తం కావాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.