THDC Recruitment 2023 : మినీరత్న సంస్థ తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్) 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- జూనియర్ ఇంజినీర్ ట్రైనీ (సివిల్) - 72 పోస్టులు
- జూనియర్ ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్) - 72 పోస్టులు
- జూనియర్ ఇంజినీర్ ట్రైనీ (మెకానికల్) - 37 పోస్టులు
- బ్యాక్లాగ్ పోస్టులు, ప్రస్తుత ఖాళీలు మొత్తం కలిపి 181 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మూడేళ్ల ఫుల్‌టైమ్ రెగ్యులర్ డిప్లొమా/ లేటరల్ ఎంట్రీ డిప్లొమా/ బిఎస్సీ/ బీఈ/ బీటెక్ చదవి ఉండాలి. 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులు డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది.
వయస్సు
2023 జూన్ 7 నాటికి గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. అయితే రిజర్వేషన్ల వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
అప్లికేషన్ ఫీజు రూ.600 ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ డిపార్ట్మెంట్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
- నోట్ :ఆసక్తి గల అభ్యర్థులు కచ్చితంగా తమ పేరును ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లో నమోదు చేసుకుని ఉండాలి. ఫుల్‌టైమ్ రెగ్యులర్ డిప్లొమా లేనివారు, కరస్పాండెన్స్ లేదా డిస్టన్స్ విధానంలో ఇంజినీరింగ్ డిప్లొమా చేసుకున్నవారు ఈ పరీక్షకు అనర్హులు.