తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్యాన్స్ చేస్తోందని చెంపదెబ్బ కొట్టిన వరుడు- పెళ్లి ఆపేసిన వధువు - వివాహానికి ముందు రోజు పెళ్లి వద్దు అన్న వధువు

తెల్లారితే పెళ్లి. ఇల్లు అంతా కోలాహలంగా ఉంది. వివాహం ముందు రోజు నిర్వహించే సంగీత్​లో అందరూ ఆడిపాడుతున్నారు. సడెన్​గా వరుడు చేసిన ఓ పనికి షాక్​కు గురైన వధువు వివాహం ఇష్టం లేదని సినిమాలోలా ట్విస్ట్​ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది?

wedding
ఆగిన పెళ్లి

By

Published : Jan 21, 2022, 1:54 PM IST

Updated : Jan 21, 2022, 2:25 PM IST

తమిళనాడు కడలూరులోని పన్రుటిలో వివాహం అర్ధంతరంగా ఆగిపోయింది. తెల్లారితే పెళ్లి అనగా వివాహం ఇష్టం లేదని వధువు ప్రకటించింది. ఆమె మాటను తల్లిదండ్రులు కాదనలేకపోయారు. దీంతో అక్కడకు వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

ఏం జరిగిందంటే..?

జనవరి 20వ తేదీన పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలు నిశ్చయించుకున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. పెళ్లికి ముందు రోజు సాయంత్రం రెండు కుటుంబాలు కలిసి రిసెప్షన్​ ఏర్పాటు చేశాయి. తరువాత సంగీత్​ కార్యక్రమం నిర్వహించాయి. అందులో డీజే కూడా పెట్టించాయి. ఇందులో వేడుకకు వచ్చిన బంధువులు, స్నేహితులతో వధువు డ్యాన్స్​ చేసింది. ఇది అంతా చూస్తున్న వరుడు పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి డ్యాన్స్​ ఆపమని అన్నాడు. స్టేజ్​ పైకి పిలిచాడు. రాగానే ఆమెను గట్టిగా లాగి చెంప దెబ్బకొట్టాడు. దీంతో పెళ్లి ఆపేయాలని వధువు అమ్మానాన్నలకు చెప్పింది.

కూతురు కోరిన విధంగా తల్లిదండ్రులు పెళ్లి ఆపేసి రాత్రికి రాత్రే మండపం నుంచి ఇంటికి వచ్చారు. వారికి తెలిసిన సమీప బంధువుతో ముందుగా నిశ్చియించిన ముహుర్తానికే పెళ్లి చేశారు.

ఇదీ చూడండి:

భుజంపై భార్య శవంతో భర్త 'పరుగు'- అంబులెన్సు లేక కాదు...

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 21, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details