తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వేతనం రూ.2లక్షలు! - నవోదయ నోటిఫికేషన్ 2022

TGT NOTIFICATION: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! నవోదయ విద్యాలయ సమితి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? వాటి వివరాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం..

Navodaya TGT PGT notification
navodaya samiti recruitment 2022

By

Published : Jul 2, 2022, 6:50 PM IST

Navodaya TGT PGT notification: టీచర్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులను భర్తీ చేయనుంది. వీటితో పాటు ప్రిన్సిపల్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్లు, పీఈటీ, లైబ్రేరియన్ ఖాళీలకు సైతం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.

పోస్టులు ఇలా..

  • మొత్తంగా 2200 ఖాళీలు ఉన్నాయి.
  • ఇందులో 584 పోస్టులు ఈశాన్య ప్రాంతానికి రిజర్వ్ చేశారు.
  • ఇతర రాష్ట్రాలకు చెందిన పోస్టులు 1616

దరఖాస్తు రుసుం

  • ప్రిన్సిపల్ పోస్టులు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.2వేలు.. అర్హత- మాస్టర్​ డిగ్రీ బీఈడీ.
  • పీజీటీ పోస్టులు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.1,800.. అర్హత- మాస్టర్​ డిగ్రీ
  • టీజీటీ, ఇతర పోస్టులు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.1,800.. బ్యాచిలర్స్​ డిగ్రీ(సంబంధిత విభాగాల్లో)
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం 02-07-2022
  • దరఖాస్తుకు చివరి తేదీ 22-07-2022

దరఖాస్తు ఎలా?

  • నవోదయ విద్యాలయ అధికారిక వెబ్​సైట్ (navodaya.gov.in) ​లో దరఖాస్తు ఫారం సమర్పించాలి.
  • రిక్రూట్​మెంట్ సెక్షన్​కు వెళ్లి.. ఆన్​లైన్ అప్లికేషన్​పై క్లిక్ చేయాలి.
  • డౌన్​లోడ్ సెక్షన్​లో ఆన్​లైన్ అప్లికేషన్​ ఆప్షన్​ను క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది.
  • అందులో సంబంధిత వివరాలు సమర్పించి.. అప్లికేషన్​ను పూర్తి చేయాలి.

వేతనం

  • ప్రిన్సిపల్- రూ.78,800- రూ.2,09,200
  • టీజీటీ- రూ.44900- రూ.142400
  • పీజీటీ- రూ.47600- రూ.151100

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details