తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు విద్యుత్ వెలుగులు.. కశ్మీరీ గ్రామస్థుల సంబరాలు - village got electricity facility for first time

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు కరెంట్​ సౌకర్యాన్ని పొందారు. ఇన్నేళ్లుగా కిరోసిన్​ దీపాలు, కొవ్వొత్తుల మధ్యే రాత్రుళ్లు గడిపిన ఆ పల్లెవాసులు తొలిసారిగా విద్యుత్​ లైటు వెలగడం చూశారు. విద్యుత్​ శాఖ అధికారులు ఎంతో కష్టపడి.. కొండ ప్రాంతంలో ఉన్న గ్రామానికి విద్యుత్​ సౌకర్యం అందేలా చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 10, 2023, 11:08 AM IST

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత ఆ గ్రామ ప్రజలు విద్యుత్ వెలుగులను కళ్లారా చూశారు. దేశమంతా 5జీ ఇంటర్నెట్​ సేవలు విస్తరిస్తున్న వేళ.. కరెంటుకు నోచుకోని ఆ పల్లెవాసులు తొలిసారిగా విద్యుత్​​ సౌకర్యాన్ని పొందారు. ఇన్నేళ్లుగా కిరోసిన్​ దీపాలు, కొవ్వొత్తుల మధ్య జీవితాన్ని వెళ్లదీసిన కుటుంబాలు కరెంట్​ రాకతో.. ఆనందంలో మునిగిపోతున్నారు. వారే జమ్ము కశ్మీర్, అనంత్‌నాగ్ జిల్లా డోరు బ్లాక్‌లోని టెథాన్ ప్రాంత ప్రజలు.

మొదటిసారి విద్యుత్​​ పొందిన ప్రజలు

ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు ఉంటాయి. దాదాపుగా 200 మంది ఇక్కడ నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో ఉండే ఈ గ్రామానికి విద్యుత్​ సౌకర్యాన్ని అందించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. 2022 సంవత్సరంలో పనులు ప్రారంభించిన విద్యుత్​ శాఖ సిబ్బంది.. ఎంతో కష్టపడి గ్రామంలో 63కేవీ ట్రాన్స్‌ఫార్మర్​ను ఏర్పాటు చేశారు. ఇంటింటికి కరెంట్ సదుపాయాన్ని అందించారు.

గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్​ఫార్మర్​

దీంతో ఆ ప్రాంత వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సౌభాగ్య పథకం కింద ఈ గ్రామానికి కరెంట్​ సదుపాయం అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా విద్యుత్​ శాఖ అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. వారందరిని పూలమాలలతో సత్కరించారు. అనంతరం బ్యాండ్​ బాజాలతో సెలెబ్రేషన్స్​ చేసుకున్నారు.

అనంత్‌నాగ్ జిల్లాలోని టెథాన్ ప్రాంతం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details