అమెరికన్ విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా.. వచ్చే ఏడాది భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించనుందని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డిమాండ్‌ను బట్టి తయారీ యూనిట్‌నూ నెలకొల్పనుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. దేశంలో దిగుమతి చేసుకుంటున్న రూ.8 లక్షల కోట్ల విలువైన ముడి ఇంధన ఉత్పత్తులను తగ్గించుకోవడం సహా గ్రీన్ ఇంధనాన్ని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
"అమెరికా విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా విక్రయ కేంద్రాలను భారత్‌లో నెలకొల్పనుంది. డిమాండ్‌ను బట్టి తయారీ యూనిట్లను స్థాపించనుంది. ఇది వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ వాహనాల తయారీ కేంద్రం కానుంది," అని గడ్కరీ తెలిపారు.