జమ్ముకశ్మీర్‌కు ఉగ్రముప్పు ఇంగా పూర్తిగా తొలగిపోలేదని భారత సైన్యం తెలిపింది. ఇప్పటికీ దాడులకు తెగబడగల సత్తా అక్కడి ముష్కరులకు ఉందని అభిప్రాయపడింది. జమ్ముకశ్మీర్ పర్యటనకు విచ్చేసిన 24 మంది విదేశీ దౌత్యవేత్తలతో కూడిన బృందానికి చినార్ కార్ఫ్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ బి. ఎస్. రాజు ఈ మేరకు గురువారం పలు వివరాలు నివేదించారు. ఉగ్రవాదుల సంఖ్యను 200లకు పరిమితం చేసినట్లు ఆయన చెప్పారు. అయినప్పటికీ ప్రజల భద్రత కోసం మరింత మంది బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
'జమ్ముకశ్మీర్‌కు ఇప్పటికీ ఉగ్రముప్పు'
ఉగ్రవాదుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ జమ్ముకశ్మీర్‌కు ఉగ్ర ముప్పు తొలగిపోలేదని భారత సైన్యం అభిప్రాయపడింది. ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న విదేశీ రాయబారులకు అక్కడి పరిస్థితిని వివరించారు లెఫ్టినెంట్ జనరల్ బి. ఎస్. రాజు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు.
సరిహద్దుల్లో నిఘా కార్యకలాపాలను విస్తృతం చేయడం వల్ల పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించడం ముష్కరులకు కష్టంగా మారిందని బి. ఎస్ రాజు తెలిపారు. అందుకే ఉగ్రవాద ముఠాలు, పాక్ సంస్థలు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి సొరంగాలను తవ్వి భారత్‌లోకి ముష్కరులను పంపించేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. చొరబాట్లకు పాక్ సైన్యం అందిస్తున్న సహకారంపై దౌత్యవేత్తలకు భారత్ సమగ్ర వివరాలు సమర్పించింది.
ఇదీ చూడండి:పాక్ ఉగ్ర చర్యలపై విదేశీ రాయబారుల ఆరా